![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -294 లో.....మొన్న పార్టీలో ధీరజ్, ప్రేమ ముద్దు పెట్టుకున్నారని నర్మద చెప్పగానే ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావే అని వేదవతి అంటుంది. శ్రీవల్లిని అక్కడ నుండి పంపిస్తుంది వేదవతి. ఏంటే ధీరజ్, ప్రేమ మధ్య ప్రేమ మొదలు అయిందా అని వేదవతి అడుగుతుంది. అయింది పార్టీలో ముద్దు పెట్టుకున్నారట.. వాళ్ళ ఇద్దరిని ఒకటే చేసే బాధ్యత నాది అని నర్మద అంటుంటే.. ఓసిని గవర్నమెంట్ కోడలో అని నర్మదకి ముద్దుపెడుతుంది వేదవతి.
ఆ తర్వాత ప్రేమ దగ్గరికి ధీరజ్ వస్తాడు. ప్రేమ మాట్లాడకపోయేసరికి కావాలనే ఫోన్ లో మాట్లాడినట్లు నటిస్తాడు. చెప్పు బేబీ అంటూ మాట్లాడుతాడు. దాంతో ప్రేమ ఫోన్ లాక్కొని లాక్ చెప్పరా.. ఎవరితో మాట్లాడుతున్నావని అడుగుతుంది. మీ అమ్మాయిలకి అందంతో పాటు అసూయ కూడా ఎక్కువేనని ధీరజ్ అనుకుంటాడు. మరొకవైపు భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు దగ్గరికి వస్తారు. ఎందుకు నా దగ్గర ఈ విషయం దాచారని రామరాజు అనగానే వాళ్ళు టెన్షన్ పడుతారు. మీరు బజ్జీలు చేసుకొని అమ్మాల్సిన అవసరమేంటి.. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయ్యొచ్చు కదా అని అంటాడు.
చేస్తాం అండి నెల రోజుల్లో మంచి స్థాయికి వస్తామని ఆనందరావు అంటాడు. గుడ్ నేను ఇంకా పెట్టుబడికి డబ్బు ఇద్దామనుకున్న కానీ మీరు సొంతంగా ఎదగాలనుకుంటున్నారు కదా అని బుజ్జీమ్మ ఈ డబ్బు లోపల పెట్టు అనగానే ఆనందరావు వంక భాగ్యం కోపంగా చూస్తుంది. బయటకు వెళ్ళాక ఆనందరావు పని చెప్తుంది. ఆ తర్వాత ధీరజ్ రెడీ అయి.. ప్రేమ దగ్గరికి వస్తాడు. నేను మొదటి రోజు క్యాబ్ డ్రైవర్ గా వెళ్తున్నానని చెప్తాడు. వద్దని ప్రేమ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |